Custom Search

చిత్ర సమీక్ష »

 

బాద్ షా రివ్యూ
శ్రీనువైట్ల ప్రేక్షకులను బాద్ షా తో బాదేషాడు



సమీక్ష : బత్తుల ప్రసాద్
రేటింగ్ : * * * 


యన్.టి.ఆర్ కాజల్ జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్లగణేష్ నిర్మించిన సినిమా బాద్ షా. 5-4-2013 న విడుదలైంది.

కథః మాఫియా డాన్ దగ్గర ఒక విభాగంలో పని చేసే వ్యక్తి ధన్ రాజు (ముఖేష్ రుషి) కుమారుడు బాద్ షా ( యన్.టి.ఆర్) అతని తల్లి (సుహాసిని). వారి ఇంట్లో కొడుకులా ఉండే సిద్దు ( సిద్దార్ధ్ ) గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోతాడు. ఆ బ్లాస్ట్ కు కారకుడైన మాఫియా డాన్ సాధుబాయ్ ని మట్టు పెట్టాలని ఓ పోలిస్ ఆఫీసర్ సహాయంతో బాద్ షా బయలు దేరి హాంకాంగ్ వెళతాడు, అక్కడ వాళ్ళ నాన్నను కలుసుకుంటాడు. అక్కడుండే చిన్న చిన్న మాఫియా గ్యాంగులను మట్టు పెడతాడు. తాను డాన్ గా ఎదుగుతాడు. సాధుబాయ్ తో తలపడతాడు. పలు మలుపులు తిరిగిన తరువాత సాధుబాయ్ ని చంపడంతో కథ ముగుస్తుంది. ఈ క్రమంలో తన ఆపరేషన్ లో భాగంగా పోలిస్ కమిషనర్ కూతురు జానకి ( కాజల్ ) ను ప్రేమలో పడేస్తాడు.
కథా నాయకుడు ఐపియస్ లో మంచి మార్కులు సాధించి తండ్రి చరిత్ర బాగా లేక పోవడం వల్ల రిజెక్ట్ కాబడతాడు. అయితే అతను చివరకు పోలీస్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ కమిషనర్ అని చెపుతారు.

నటీనటుల ప్రతిభః
యన్.టి. ఆర్ బాద్ షా లాంటి పాత్రకు సరిపడ లేదు. దానికి తోడు అతని క్రాఫ్ మారడంతో మనిషి పొట్టిగా కనిపిస్తాడు. ఇక ఎంటర్ టైన్ మెంట్, డాన్స్ లో తన సత్తా చూపించాడు. కాజల్ నటన పరంగా ఓకె. తనలో మునుపటి చార్మ్ లేదు. ఇక యం.యస్. నారాయణ, బ్రహ్మానందం పాత్ర దూకుడు లో ఉన్న తరహాలోనే ఉంటాయి. ఆశిష్ విద్యార్థి, నాజర్, షిండే, షఫి, రాజీవ్ కనకాల పాత్రలన్నీ చాలా చిన్నవే. నవదీప్ విలనీ తరహా పాత్ర బాగా చేశాడు. ఇంకా చాలా మంది పాత్రలు ఉన్నా ముఖ్యంగా హీరో పాత్రకు ఉన్న ప్రాధాన్యత మరే పాత్రకు లేదు కాబట్టి ప్రస్తావించడం కూడా దండగే.

దర్శకుడి ప్రతిభః
శ్రీను వైట్లలో విషయం అయిపోయింది అని ఈ సినిమా చూసిన వారికి అవగతమౌతుంది. తాను గతంలో తీసిన సినిమాల్లో లాగా ఈ సినిమాలో కూడా అదే తరహా కామెడీ ఉంది. పెద్ద హీరో.. కంట్రోలు లేని బడ్జెట్ , కావలసినంత మంది ఆర్టిస్టులు, ఫారిన్ లొకేషన్... ఇన్ని ఉన్నా కూడా ఎంత సేపూ హీరోను ఎలివేట్ చేయడానికే చూశాడు తప్ప కథను ఆసక్తి దాయకంగా నడపలేక పోయాడు. ఇందులో యం.యస్. నారాయణ పాత్రకు రివెంజ్ నాగేశ్వరరావు అనే పేరు తో రామ్ గోపాల్ వర్మ పై సెటైర్ వేశాడు.

ఈ సినిమాలో కొత్త విషయం ఏంటంటే ... ఇంత వరకు కమెడియన్లతోనే తాగించిన దర్శకుడు ఈ సినిమాలో ఆడవాళ్లతో మద్యపానం చేయించి వారితో పాత సినిమాల్లో జ్యోతిలక్ష్మి, జయమాలిని లు చేసిన ఐటమ్ సాంగ్ లకు డాన్స్ వేయించాడు.అంతకు మించి సినిమాలో కొత్త దనం లేదు. పాటల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తుంది. సినిమా ప్రతి ఫ్రేములో రిచ్ నెస్ కనిపిస్తుంది.

సమీక్షః
ఇది దర్శకుడి మార్కు సినిమా. సినిమా మూల కథ చూస్తే "పోకిరి" కథలాగే ఉంది. సినిమా నడక మాత్రం "దూకుడు" లా ఉంది . అదే సినిమా నేపథ్యం. బ్రహ్మానందాన్ని బకరా చేయడం. యమ్.యస్. నారాయణ ను సినిమా డైరెక్టర్ గా చూపి సినిమా మీద సెటైర్ లు వేయడం. చిన్న కథను తీసుకుని సాగబీకారు. కథానాయకుడిని డాన్స్ వేయించడం కోసం పెట్టిన పాటలు కథకు స్సీడ్ బ్రేకర్ లా అడ్డు పడతాయి.

సినిమా సెకండాఫ్ లో హీరో విలన్ ను చంపుతాడని తెలిసినప్పటికీ ఇంకా చంపడేమిటి అనే విసుగు వస్తుంది. సినిమాలో డైలాగులు చాలా బాగున్నాయి. మంచి పంచ్ లు పడ్డాయి. ఉదాహరణకు హీరోయిన్ ను పొగుడుతూ హీరో మెడ నెక్లస్ రోడ్డు, నడుము నేషనల్ హైవే అని పొగుడుతుంటే హీరోయిన్ చె ల్లెళ్ళు వీడు ఆర్ అండ్ బిలో పని చేసినట్టున్నాడు రోడ్లు తప్ప మరే విషయం తెలియదు అంటుంది. సినిమాకు ప్రాణం డైలాగులే. అంతకు మించి ఈ సినిమాలో చెప్పుకోతగ్గ కొత్త విషయాలు అంటూ ఏమీ లేవు.

కథ పాతదే... చెప్పిన విధానం పాతదే.... అన్ని సినిమాల్లో లాగే ఈ సినిమాలో కూడా హీరో గన్ను మాత్రమే గురితప్పకుండా తగులుతుంది. విలన్ లు హీరోపై ఎంత అధునాతన తుపాకీతో కాల్చినా కూడా బుల్లెట్ కూడా మీదికి రాదు. ఇలా ఎన్నో అతిశయోక్తులు సినిమాలో ఉన్నాయి. పూరీ జగన్నాధ్ ఎక్కడో కాపీ కొట్టిన "పోకిరి" సినిమా కథ తీసుకుని తన సినిమాలన్నింటినీ కలిపి మిక్సీలో వేసి తయారు చేసినట్టుంది సినిమా. ఫైట్లు, మాఫియా లు పక్కన పెడితే యన్.టి.ఆర్ డాన్స్...కామెడీ ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. 


  • అరవింద్ 2 - పూర్తి స్థాయి హారర్ సినిమా
  • ఫీల్ గుడ్ మూవీ - ప్రియతమా నీవచట కుశలమా
  • స్వామిరారా రివ్యూ
  • పాత కుండలో కొత్తసారా - బ్యాడ్ బాయ్
  • ౩ జి లవ్ ...
  • బ్యాక్ bench స్టూడెంట్...
  • తెలుగు తెర క్లాసిక్ "గుండెల్లో గోదారి''
  • రాజశేఖర్ తరహా మరో పోలీస్ చిత్రం "మహంకాళి'
  • మిస్టర్ పెళ్ళి కొడుకు -అతి మంచివాడు